అమరావతి: ఏపీ అసెంబ్లీ లాబీల్లో  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. బాగున్నారా అంటూ ఇద్దరూ పరస్పరం పలకరించుకొన్నారు.

బాలకృష్ణ సరసన రోజా పలు సినిమాల్లో నటించారు. తొలుత రోజా టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత రోజా కాంగ్రెస్ పార్టీలో అక్కడి నుండి వైసీపీలో చేరారు. గత ఐదేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబుపై, టీడీపీ నేతలపై రోజా నిప్పులు చెరిగారు. 

రోజాను  గత టర్మ్‌లో ఏడాదిపాటు సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు అసెంబ్లీ లాబీల్లో రోజాతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు బారులు తీరారు. ఈ సమయంలోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొంచెంద ఇబ్బందిపడ్డారు. మార్షల్స్ సాయంతో అచ్చెన్నాయుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.