Asianet News TeluguAsianet News Telugu

రామతీర్థంలో 28న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్టాపన.. వెలంప‌ల్లి

విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండ పై గల  శ్రీ కోదండరాముని ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుమలలో తయారు చేయించిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు  రామతీర్థానికి ప్రత్యేక వాహనంలో చేరుకున్నాయని, కొండ దిగువ ఉన్న ప్రధాన ఆలయంలోని బాలాలయంలో  28న ప్రతిష్టాపన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ‌ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.

Installation of rama idols in ramatheertham on the 28th jan - bsb
Author
Hyderabad, First Published Jan 25, 2021, 3:35 PM IST

విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండ పై గల  శ్రీ కోదండరాముని ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుమలలో తయారు చేయించిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు  రామతీర్థానికి ప్రత్యేక వాహనంలో చేరుకున్నాయని, కొండ దిగువ ఉన్న ప్రధాన ఆలయంలోని బాలాలయంలో  28న ప్రతిష్టాపన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ‌ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.

సొమ‌వారం బ్రహ్మాణ ‌వీధిలోని మంత్రి కార్యాయ‌లంలో విజ‌య‌న‌గ‌రం ఎసీ సి.హెచ్ రంగ‌‌రావు, అర్చ‌కులు వెంక‌ట‌సాయిరాం క‌లిసి 28న ప్రతిష్టాపన కార్య‌క్ర‌మానికి మంత్రిని ఆహ్వానించారు.

తిరుమలలో నిష్ణాతులైన శిల్పులతో కృష్ణ శీలరాతితో విగ్రహాలను తయారు చేయించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. విజయనగరం చేరిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలను రామతీర్థం ప్రధానాలయంలో ప్రత్యేకంగా ధాన్యంతో నింపి చక్కగా అలంకరించిన హోమ శాలలో భద్రపరిచారు. 

ఈ నెల 28న బాలాలయంలోనే సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టిస్తామని అయితే, 25 నుంచే స్వామికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. తిరుపతి వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాస చార్యులు ఆధ్వర్యంలో వైఖాసన ఆగమ సంప్రదాయం ప్ర‌కారం ఆదివాసం, హొమాలు, విగ్ర‌హాప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాలు కొండ దిగువన  ఉన్న రామాలయంలోని క‌ల్యాణ‌మండ‌పంలో జ‌రుగుతాయ‌న్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios