Asianet News TeluguAsianet News Telugu

జగనన్న కిట్ల పంపిణీలో అక్రమాలు... విద్యాశాఖ డైరెక్టర్ పై విచారణకు జగన్ సర్కార్ ఆదేశాలు

అవినీతి ఆరోపణల నేపథయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడుపై విచారణకు జగన్ సర్కార్ ఆదేశించింది. 

inquiry on ap school education director chinaveerabadrudu akp
Author
Amaravati, First Published Jul 8, 2021, 11:19 AM IST

అమరావతి: విద్యాశాఖలో అవినీతి అక్రమాలు, దళిత ఉద్యోగులపై వేధింపులు, అక్రమ అధికారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడుపై విచారణకు జగన్ సర్కార్ ఆదేశించింది. ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణ ను విచారణాధికారిగా నియమించారు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్. 

వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జగనన్న విద్యా కిట్ల పంపిణీలోనూ చినవీరభద్రుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కర్నూల్ జిల్లాకు చెందిన తేనె సాయిబాబా అనే వ్యక్తి  చినవీరభద్రుడు అవినీతిపై సీఎంవో, సీఎస్ అదిత్యనాధ్ దాస్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. 

read more  ఆగస్ట్ 16నుండి రాష్ట్రంలో స్కూల్ రీఓపెన్: ఏపి విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

ఇదిలావుంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దేవదాయశాఖ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. దేవదాయ ముఖ్య కార్యదర్శి, కమీషనర్, ద్వారకా తిరుమల ఈవోకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. 

గతంలో తమకు 27శాతం మధ్యంతర భృతి అమలు చేయడం లేదంటూ హైకోర్టులో ఎన్‌ఎంఆర్‌లు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర భృతి అమలు చేయాలని డిసెంబర్‌లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకూ కోర్టు ఉత్తర్వులను దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయడం లేదు. దీంతో బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు. 

Follow Us:
Download App:
  • android
  • ios