Inner ring road case : ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్ట్ లో నేడు విచారణ..

Inner ring road case : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పై ఈరోజు హైకోర్టు లో విచారణ జరగనుంది. గత విచారణ సమయంలో నేటి వరకు (మంగళవారం) అరెస్టు చేయకూడదని ధర్మాసనం ఆదేశించింది.

Inner ring road case.. Chandrababu anticipatory bail hearing in high court today..ISR

Inner ring road case టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)పై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్ కేస్ లో ముందస్తు బెయిల్ పై నేడు (మంగళవారం) హై కోర్ట్ (high court) లో  విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుకు నేటి వరకు అరెస్టు చేయకూడదని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

నిరుద్యోగులకు వయోపరిమితి సడలిస్తాం: కరీంనగర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బండి సంజయ్

గత విచారణలో ఏసీబీ కోర్ట్ లో విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్ (PT Warent)పై మంగళవారం వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ ఇన్నర్ రింగ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు అన్ని విధాలా సహకరిస్తారని ఆయన తరఫు న్యాయవాదులు గత విచారణలో కోర్టుకు తెలిపారు. 

బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా తీవ్రత..

ఇదిలా ఉండగా.. ఫైబర్‌నెట్‌ కేసులో నిందితుల ఆస్తుల ఆటాచ్ కు అనుమతి ఇవ్వాలని సీఐడీ (CID) విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court)లో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తులను అటాచ్ మెంట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ సోమవారం సీఐడీ పిటిషన్ వేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios