గాయపడిన బౌన్సర్లు ఇళ్లకు: పవన్ కల్యాణ్ యాత్రకు విరామం

First Published 24, May 2018, 9:33 PM IST
Injured bouncers sent back
Highlights

జనసేన పోరాట యాత్రకు గురువారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విరామం ప్రకటించారు

శ్రీకాకుళం: జనసేన పోరాట యాత్రకు గురువారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విరామం ప్రకటించారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో గత పది రోజులుగా ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. 

పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కనీస పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయలేదని, దాంతో సొంత భద్రతా సిబ్బందితోనే ఈ పర్యటన సాగిస్తున్నారని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. 

బృందంలోని 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారు కోలుకోవడానికి వారిని పవన్ కల్యాణ్ వారివారి స్వస్థలాలకు పంపించారు. వారి స్థానంలో కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉంది. దాంతో ఆయన తన యాత్రకు గురువారం విరామం ప్రకటించారు.

జనంతాకిడిని దృష్టిలో ఉంచుకుని భద్రతా సిబ్బంది తక్కువగా ఉన్న నేపథ్యంలో పవన్ కల్యామ్ శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారమూల ప్రాంతంలో అతి కొద్ది మంది పార్టీ అనుచరులతో కలిసి విడిది చేసారు. తదుపరి యాత్ర షెడ్యూల్ ను గురువారం ప్రకటిస్తారు. శనివారం నుంచి యాత్ర కొనసాగుతుంది.

loader