మద్యం అతడిని ఆలోచన శక్తిని దూరం చేసింది. తనను ప్రేమగా నాన్న అని పిలిచిన అన్న కూతురుపైనే అత్యాచారం చేసేలా దిగజార్చింది. చిన్నారి కేకలు వేయడంతో తలపై బండతో బాది అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి చనిపోవడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
సొంత అన్న కూతురు అని చూడకుండా ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు.
అంత వరకు తనను నాన్న అని పిలిచిన పాప అని కూడా చూడకుండా ఆమె పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కృష్ణా (krishna)జిల్లాలోని కీసర (keesara) ప్రాంతంలో ఈ నెల 9న ఓ చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారికి మృతికి గల మిస్టరీని పోలీసులు సోమవారం చేధించారు. చిన్నారి ప్రాణం తీసింది సొంత చిన్న నాన్నే అని చెప్పారు.
నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి (dsp nageshwar reddy) తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన మృతురాలి కుటుంబం కొన్ని సంవత్సరాల కిందట మృతురాలి కుంటుంబం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంచికర్ల ప్రాంతంలోకి వచ్చి ఉంటున్నారు. జీవనాధారం కోసం ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, వేస్ట్ పేపర్లు వంటివి ఏరుతుంటారు. వాటిని అమ్మేసి అలా వచ్చిన డబ్బు ద్వారా జీవనం సాగిస్తున్నారు. మృతురాలి బాబాయ్ అదే జిల్లాలోని మైలవరం ప్రాంతంలో ఉంటాడు. అతడి కుటుంబం కూడా అక్కడే ఉంటోంది. 7వ తేదీన అతడు బాలిక ఇంటికి వచ్చి, తనతో పాటు మైలవరం తీసుకెళ్లాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే చిన్నారిని ఓ ఆటోలో కూర్చొబెట్టి అతడి ఊరికి బయలుదేరాడు.
మైలవరం వెళ్లే మార్గంలో డ్రింక్ చేశాడు. దీంతో అతడికి మత్తు ఎక్కింది. ఇంటికి వెళ్లే దారిలోనే కీసర వద్ద చిన్నారికి స్నానం పోశాడు. అయితే ఆ సమయంలోనే అతడికి చిన్నారిని అత్యాచారం చేయాలనే చెడ్డ ఆలోచన పుట్టింది. ఆటో తీసుకుని సమీపంలోని సుబాయిల్ పండ్ల చెట్లలో సమీపంలోకి వచ్చారు. అక్కడి నుంచి నడుచుకుంటూ పాపను తీసుకుని ఆ చెట్ల వైపు వెళ్లాడు. అయితే దీనిని గమనించిన కొందరు మహిళలు చిన్నారిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడిగారు. అయితే దానికి అతడు తాము చింక కాయలు తెంపుకోవడానికి వెళ్లాలనుకుంటున్నామని అన్నాడు. పాప కూడా అతడిని నాన్నా అని పిలుస్తుండటంతో అక్కడ పని చేసే మహిళలకు ఎలాంటి అనుమానం రాలేదు. నిజమైన నాన్నే అనుకొని నమ్మారు.
ఆ పండ్ల చెట్ల సమీపంలోని ఎవరూ లేపి ప్రాంతానికి ఆ చిన్నారిని తీసుకెళ్లాడు. ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేసింది. పాప కేకలతో అతడికి కోపం వచ్చింది. ఓ రాయి తీసుకొని చిన్నారి తల భాగంలో చాలా సార్లు కొట్టాడు. దీంతో ఆ దెబ్బలు తాళలేక ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి చనిపోయినట్టు నిర్ధారణ చేసుకున్నాక నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి మృతదేహాన్ని 9వ తేదీన స్థానికులు గుర్తించారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ మొదలు పెట్టారు. అయితే ఈ ఘటనను మొదట హత్యగానే పోలీసులు భావించారు. కానీ పోస్టు మార్టం నివేదిక వచ్చిన తరువాత చిన్నారిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనకు పాల్పడింది సొంత చిన్ననాన్ననే అని నిర్దారణకు వచ్చి అతడి కోసం గాలించారు. అతడిని వెతికిపట్టుకునేందుకు ఆరు బృందాలు పని చేశాయి. ఈ క్రమంలో నిందితుడు తెలంగాణ రాష్ట్రంలోని మధిరలో ప్రాంతంలో కనిపించాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. విచారణలో తానే ఈ ఘటనకు పాల్పడ్డానని చెప్పాడు.
