అమరావతి: వరదలతో గోదారి నది ఉగ్రరూపం దల్చింది. భద్రాచలం వద్ద 58 అడుగులకు మించి నీటిమట్టం నమోదైంది. దేవీపట్నంలోని 36 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి. 

గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది.

దాంతో గోదావరి ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఆయన సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 

కృష్ణా జిల్లాలో కరుస్తున్న భారీ వర్షాలపై, తర్వాతి పరిస్థితులపై కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.