Asianet News TeluguAsianet News Telugu

కూచిభొట్లను జాతి విద్వేషంతోనే చంపా: ప్యూరిటన్

ఆంధ్ర టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరిటన్ తన నేరాన్ని అంగీకరించాడు. 

Indian Techie Srinivas Kuchibhotla's Killer Pleads Guilty to Hate Crime

వాషింగ్టన్‌:  ఆంధ్ర టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరిటన్ తన నేరాన్ని అంగీకరించాడు. కూచిభొట్ల హత్య కేసుల అతను ఇప్పటికే జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. జాతి విద్వేషం కేసులో ఆడమ్ ప్యూరిటన్ తన నేరాన్ని అంగీకరించాడు.

జాతి విద్వేషం కింద దాఖలైన మూడు ఫెడరల్‌ ఆరోపణల్లో తన నేరాన్ని అంగీకరిస్తూ అమెరికా కోర్టులో సోమవారం ‌వాంగ్మూలం ఇచ్చాడు. జాతి విద్వేషం ఆరోపణల కేసులో ప్యూరింటన్‌కు మరణ శిక్ష పడవచ్చు. అయితే నేరాన్ని అంగీకరించడంతో శిక్షను జీవిత ఖైదుకు తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. 

ఈకేసులో జూన్‌ 2వ తేదీిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేస్తుంది. అమెరికా నేవీకి చెందిన 53 ఏళ్ల ప్యూరింటన్‌ కూచిభోట్ల శ్రీనివాస్‌, అతని స్నేహితుడు అలోక్‌ మాదసానిపై కాల్పులు జరిపినట్లు అంగీకరించాడు. జాతి విద్వేషం కారణంగానే వారిద్దరినీ చంపేందుకు యత్నించానని అంగీకరించాడు.

కూచిభొట్ల హత్య కేసులో ప్యూరింటన్‌కు మే5న కోర్టు జీవితకాల శిక్షను విధించింది. అయితే జాతి విద్వేషం కేసులో గతంలో తన నేరాన్ని నిందితుడు ఆ సమయంలో అంగీకరించలేదు. 

నిరుడు ఫిబ్రవరి 22న కాన్సస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌, అతని స్నేహితుడు అలోక్‌ లపై అతను కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కూచిభొట్ల మృతి చెందగా అలోక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్యూరిటన్ ను అడ్డుకోబోయిన ఆమెరికా జాతీయుడు కూడా గాయపడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios