Asianet News TeluguAsianet News Telugu

భారత జలాల్లోకి 11 మంది శ్రీలంక మత్స్యకారులు.. కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించిన కోస్ట్ గార్డ్

భారత జలాల్లోకి ప్రవేశించిన 11 మంది శ్రీలంక మత్స్యకారులను భారత తీర రక్షక దళం పట్టుకుంది. మత్స్యకారులతో పాటు రెండు బోట్లను కూడా స్వాధీనం  చేసుకుంది.  

indian Coast Guard has handed over 11 Sri Lankan fishermen to Kakinada marine police
Author
First Published Nov 13, 2022, 2:50 PM IST

భారత జలాల్లోకి ప్రవేశించిన 11 మంది శ్రీలంక మత్స్యకారులను భారత తీర రక్షక దళం పట్టుకుంది. మత్స్యకారులతో పాటు రెండు బోట్లను కూడా స్వాధీనం  చేసుకుంది.  అనంతరం మత్స్యకారులను, బోట్లను కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై కాకినాడలో మెరైన్ పోలీసులు, మత్స్య శాఖ, కస్టమ్స్,  ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. వివరాలు.. నవంబర్ 10వ తేదీన బంగాళాఖాతంలో గస్తీ నిర్వహిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత జలాల్లో ఫిషింగ్ చేస్తున్న రెండు బోట్‌లతో పాటు 11 మంది శ్రీలంక మత్స్యకారులను పట్టుకున్నారు. శ్రీలంక బోట్లను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం నుండి 175 నాటికల్ మైళ్ల దూరంలో ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఫిషింగ్ చేస్తుండగా వారిని పట్టుకున్నట్టుగా సమాచారం. అనంతరం తదుపరి విచారణ కోసం శనివారం కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించారు. 

నవంబర్ 10వ తేదీన భారత జలాల్లో చేపల వేట సాగిస్తున్న శ్రీలంక మత్స్యకారులను కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించినట్టుగా కాకినాడ మెరైన్ పోలీసులు తెలిపారు. వారితో పాటు రెండు ఫిషింగ్ బోట్లను, 300 కిలోల చేపలను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మత్స్యకారులను, రెండు బోట్లను కోస్ట్‌గార్డ్‌ అధికారులు తమకు అప్పగించినట్టుగా చెప్పారు. 

శనివారం తాము విచారణ ప్రారంభించినట్టుగా చెప్పారు. అన్ని విభాగాలు జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేయడం జరిగిందన్నారు. మత్య్సశాఖ ఆధ్వర్యంలో వారి నుంచి పట్టుకున్న చేపలను వేలం వేయడం జరిగిందని  తెలిపారు. అయితే చేపలు పట్టుకోవడానికి వచ్చిన సమయంలో రూట్ మారిందని మత్స్యకారులు చెబుతున్నారని తెలిపారు. అయితే భారత జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. సంబంధిత సెక్షన్‌లపై చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. వారి గురించి చెన్నైలోని శ్రీలంక ఎంబసీకి సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్టుగా తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకన్న బోట్స్‌లో కూడా అన్ని విధాలుగా తనిఖీ చేస్తున్నట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios