విమాన ప్రమాదం తప్పించుకున్న టిడిపి నేతలు

Indian airlines passengers had a miraculous escape in vizag
Highlights

  • ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిరిండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.

ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిరిండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ విమానంలో మంత్రి కళా వెంకట్రావు, ఎమ్మెల్యేలు గణబాబు, గౌతు శ్యామసుందర శివాజీ, వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన మొదలైంది. విజయవాడ నుంచి విశాఖకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని ప్రయాణీకులెంతమంది అన్న విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. విమానం ల్యాండ్ అవ్వటానికి వాతావరణం అనుకూలించక, కొంత సాంకేతిక సమస్యకూడా తోడవ్వటంతో అర్ధగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ సమయంలో ఓ చక్రం పంక్చర్ కూడా అయ్యిందని సమాచారం. మొత్తానికి పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి సాహసం చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది.  

loader