తొలిరోజే రెండు స్వర్ణాలతో పాటు ఏడు పతకాలతో ఘనంగా ప్రారంభించింది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆతిధ్య భారత్ అదిరగొట్టింది. తొలిరోజే రెండు స్వర్ణాలతో పాటు ఏడు పతకాలతో ఘనంగా ప్రారంభించింది. మహిళల షాట్ పుట్ లో మన్ ప్రీత్ కౌర్, పురుషుల 5000 మీటర్ల పరుగులో జి. లక్ష్మణ్ స్వర్ణాలతో అదరగొట్టారు. కాగా మొదటిరోజు జరిగిన ఏడు ఈవెంట్లలో ఇండియా ఆరింటిలో పతకాలు సాధించింది.
మహిళల లాంగ్ జంప్ లో భారత్ కు రెండు రజతాలు లభించాయి. వి. నీనా 6.54 మీటర్లతో రజతం సాధించగా, మహిళల 5000 మీటర్ల పరుగులో సంజీవని జాదవ్ కంచు మోత మోగించింది. ఇక, పురుషుల డిస్కస్ త్రో లో వికాశ్ గౌడ కంచుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, వికాశ్ డిస్కస్ త్రోలో హ్యాట్రిక్ స్వర్ణంపై గురిపెట్టాడు. అయితే, సరైన ఆటతీరును కనబరచని కారణంగా నిరాసపరిచాడు. మహిళల 100 మీటర్ల పరుగులో స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. ప్రిలిమ్స్ లో ద్యుతి 11.40 సెకన్లలోనే 100 మీటర్లను చేరుకుని అగ్రస్ధానం సాధించింది.
