కృష్ణాజిల్లా, నందిగామ వీరులపాడు మండలం జూజ్జూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకుని ఇంటిపై ఇన్కమ్ టాక్స్ మరియు ఐటి అధికారులు ఆదివారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేశారు.
కృష్ణాజిల్లా, నందిగామ వీరులపాడు మండలం జూజ్జూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకుని ఇంటిపై ఇన్కమ్ టాక్స్ మరియు ఐటి అధికారులు ఆదివారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేశారు.
"
సదరు నాయకుడు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదు రావడంతో
అధికారులు పూర్తి స్థాయిలో ఆయన ఇంటిని రెండు గంటల పైగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో మీడియాని అనుమతించకపోవడం, కనీసం మీడియాకు తెలుపకపోవటం మీడియా వారు అడిగిన ఏ ప్రశ్నకి అధికారులు సమాధానం ఇవ్వడం లేదు.
తనిఖీల అనంతరం వైకాపా నాయకుడిని విచారణ నిమిత్తం హైదరాబాద్ లోని మరొక గృహానికి తరలించినట్లు సమాచారం. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఐటి దాడుల కలకలంతో వీరులపాడు మండలం ఒక్క సారిగా ఉలిక్కి పడిందని మండల ప్రజలు భావిస్తున్నారు.