అమరావతి: టీడీపీ  కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి  ఇంటిపై గురువారం నాడు ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

 హైద్రాబాద్‌తో పాటు కడప జిల్లాలోని శ్రీనివాసులు రెడ్డి    ఇంటి పై ఐటీ అధికారులు సోదాలు చేశారు. గురువారం నాడు ఉదయం శ్రీనివాసులు రెడ్డి ఇంటికి  పోలీసు బలగాలతో ఐటీ అధికారులు వచ్చారు. 

Also read:చంద్రబాబునాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు

 ఆర్‌కె ఇన్‌ఫ్రా అనే కంపెనీ శ్రీనివాసులు రెడ్డికి ఉంది..గత ఏడాది ఏప్రిల్ మాసంలో  జరిగిన ఎన్నికల సమయంలో కూడ శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

హైద్రాబాద్‌లోని  ద్వారకానగర్‌లోని శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో  అధికారులు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే  ఐటీ అధికారులు  సోదాలు నిర్వహించే సమయంలో శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేరని తెలుస్తోంది. 

శ్రీనివాస్ రెడ్డి తండ్రి రాజగోపాల్ రెడ్డి టీడీపీ హయంలో మంత్రిగా పనిచేశారు.  హైద్రాబాద్, కడపలలో ఏకకాలంలో సోదాలు సాగుతున్నాయి.కడపలో శ్రీనివాసులు రెడ్డి నివాసం వద్ద స్థానికంగా పోలీసులను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా   అధికారులు