పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతానికి అనుకోని తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా దానికి అనుబంధంగా 5.8 కిమీ ఎత్తులో ఆవర్తనం కూడా కొనసాగుతుంది. తీవ్ర అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారి కోస్తాంధ్ర తీరంవైపు పయనించనుందని దీనిప్రభావంతో రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తీరంవెంబడి దీనిప్రభావంతో యాభై కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు.

ఈ కారణంగా ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. విశాఖలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గాజువాక మండలంలోని తోకాడ చెరువుకు గండి పడింది.  దీంతో కుంచుమాంబ కాలనీ, సాయినగర్ కాలనీలు నీట మునిగాయి. మచిలీపట్నంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వ్యవసాయ శాఖ జేడీ ఆఫీసులో పైళ్లు, కంప్యూటర్ స్కాన్లు పూర్తిగా తడిచిపోయాయి. అద్దె భవనం కూడా కూలడానికి సిద్ధంగా ఉంది.

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి,కృష్ణా నదులకు భారీగా వరదలు వస్తున్నాయి. తుంగభద్ర మొత్తం గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. ఈ సీజన్ లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. శ్రీశైలం 7గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 

Also read: బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం స్పందన ఇదీ...

శ్రీశైలం ప్రాజెక్టుకు 4లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది. నాగార్జున సాగర్ 12గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 

Also REad:video : ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీర్చిన పోలీసులు