సీబీఐ మాజీ జేడీ లక్ష్మీణారాయణ తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి చేస్తానని వెల్లడించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని వివరించారు. అలాగే, వైజాగ్ స్టీట్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. 

హైదరాబాద్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పాలకొల్లులోని ఓ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే డా. బాబ్జి గృహం వద్ద మీడియాతో మాట్లాడారు.

తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఏ పార్టీ టికెట్ పై పోటీ చేస్తాడనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నారని వివరించారు. 

Also Read: 30 ఏళ్ల హైదరాబాదీ బ్రెయిన్ డెడ్.. అవయవదానం చేసిన కుటుంబం

ఇదే సందర్భంలో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని అన్నారు. ప్రైవేటీకరణ కాకుండా తన వంతు పోరాడుతానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వావిలాల గోపాలకృష్ణ ఉద్యమాన్ని గుర్తు చేశారు. 1980లో ఆయన పైసా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ. 100 ఇస్తే రూ. 850 కోట్లు సమకూరుతుందని, ఇలా నాలుగు నెలలు సేకరిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవచ్చని సెలవిచ్చారు.