ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న వివాహేతర సంబంధం

illegal affairs kills three people in west godavari district
Highlights

వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం  కొనసాగిస్తుందన్న మనస్థానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే తన ప్రేయసి మృతిని తట్టుకోలేక వివాహిత ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా వివాహేతర సంబంధం కారణంగా ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి.
 
జంగారెడ్డి గూడెంకు చెందిన సాయి-బిందు భార్యాభర్తలు. సంవత్సరం క్రితమే ఈ జంటకు వివాహమవగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఈ సోషల్ మీడియా వారి పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. బిందుకు పేస్ బుక్ ద్వారా మురళి అనే యువకుడితో పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. దీంతో భర్తకు తెలియకుండా బిందు తరచూ మురళిని కలిసేది.

అయితే భార్య మరో యువకుడితో అక్రమ సంబంధం కల్గివుందని తెలుసుకున్న సాయి మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భర్త మరణాన్ని తట్టుకోలేక బిందు కూడా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఆత్మహత్యలకు కారణమైన మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

పోలీసుల విచారణతో బయపడిపోయిన మురళి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా వివాహేతర సంబంధం ముగ్గురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
 
loader