Asianet News TeluguAsianet News Telugu

మూడునెలల కిందటే పెళ్లి.. ఐఐటీ పీహెచ్ డీ విద్యార్థి ఆత్మహత్య

ఆమె చెన్నయ్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాక చదువురీత్యా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 25న తల్లిదండ్రులు, చిన్నాన్న కామేశ్వరావు కూడా కొండలరావుతో ఫోన్లో మాట్లాడారు. 

IIT Student Commits suicide in Kharaghpur
Author
Hyderabad, First Published May 1, 2020, 9:15 AM IST

అతను చదువులో టాప్.. టాప్ ఐఐటీ కాలేజీలో పీహెచ్ డీ చేస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో మంచి ఉద్యోగం సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటాడని కుటుంబసభ్యులంతా ఆశపడ్డారు. కానీ ఆయన మాత్రం అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించేశాడు. ఈ దారుణ సంఘటన  ఖరగ్ పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయనగరం అయ్యకోనేరు దక్షిణ గట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న భవానీభట్ల భాస్కరరావు, సుధామాణిక్యం రెండో సంతానమైన భవానీభట్ల కొండలరావు (30)పశ్చిమబంగ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం అక్కడే పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి-14(ప్రేమికుల రోజు)న కాకినాడ ప్రాంతానికి చెందిన యువతితో ఆయనకు వివాహమైంది. 

ఆమె చెన్నయ్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాక చదువురీత్యా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 25న తల్లిదండ్రులు, చిన్నాన్న కామేశ్వరావు కూడా కొండలరావుతో ఫోన్లో మాట్లాడారు. మరోసారి ఆదివారం కొండలరావుతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ అన్న సమాచారం వచ్చింది.

పదేపదే స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో అక్కడున్న ఇతరులతో వాకబు చేశారు. ఆయన ఉంటున్న గది తలుపులు వేసి ఉన్నాయని తెలిపారు. అంతలోనే సోమవారం ఉదయం ఖరగ్‌పూర్‌ పోలీసులు భాస్కరరావుకు ఫోన్‌ చేసి ‘మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని చెప్పారు. ఆ వార్తతో కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. 

వెంటనే తండ్రి భాస్కరరావు, చిన్నాన్న కామేశ్వరావులు కరోనా నేపథ్యంలో ముందస్తు అనుమతి తీసుకుని ఖరగ్‌పూర్‌కు వెళ్లారు. మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేసుకుని ఐఐటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌లో విజయనగరం బయలుదేరి వచ్చారు. బుధవారం ఉదయం కొత్తపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  ఆత్మహత్యపై ఖరగ్‌పూర్‌ పోలీసులు ఎటువంటి సమాచారాన్ని తెలియజేయలేదు. విద్యార్థికి సంబంధించి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, పర్సు కూడా పోలీసుల వద్దే ఉన్నాయి. విచారణ అనంతరం వాటిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios