కడప ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప జగన్ ముఖ్యమంత్రి కాలేడు. జగన్ కి డేరా బాబా గతే. రోజా గురించి మాట్లాడటం టైం వేస్టు వ్వవహారం.

 కడప జిల్లాను ప్రత్యేక రాష్ట్రం చేస్తే తప్ప జగన్‌ ముఖ్యమంత్రి కాలేడ‌ని మంత్రి కొల్లు రవీంద్ర సెటైర్లు వేశాడు. చివరకు జ‌గ‌న్ కి డేరా బాబా గ‌తే ప‌డుతుంద‌న్నారు. "అంతేందుకు సొంత పార్టీ నేత‌లే జ‌గ‌న్ ని న‌మ్మ‌డం లేదు" అని విమ‌ర్శించారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.


 నంద్యాల ఫలితమే రేపు కాకినాడలో పునరావృతం కాబోతోందన్నారు ర‌వీంద్ర. పిరాయింపు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్‌ విసురుతున్న జగన్‌.. ముందు పులివెందులలో రాజీనామా చేసి గెలవాలని చెప్పారు. నంద్యాలలో కోట్లు ఖర్చు చేసిందీ.. పోలీసులకు దొరికిందీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కోట్లు ఖ‌ర్చు పెట్టిన వైసీపీ అభ్య‌ర్థీ విజ‌యం ద‌క్కించుకోలేద‌న్నారు. రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలకు అంత మంచిందని కామెంట్ చేశారు.

టీడీపీ రాష్ట్ర ప్ర‌జ‌ల అభివృద్దికి క‌ట్టుబడింద‌న్నారు. 2019 లో కూడా టీడీపీకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టడానికి సిద్దంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. వెనకబడిన తరగతులకు వివాహం కోసం రూ.25వేల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు.

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి