Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి తుఫాన్ ముప్పు తప్పినా.. సముద్ర తీరాలకు మిగిల్చిన తీవ్ర నష్టం

జవాద్ తుఫాన్ ప్రభావం ఏపీకి తప్పినప్పటికీ.. సముద్రతీరాలకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.  

If the hurricane threatens the AP .. severe damage left to the seashore
Author
Vishakhapatnam, First Published Dec 5, 2021, 5:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సముద్రం ఎంత ప్ర‌శాంతంగా ఉంటుందో.. దాని కోపం అంత కోపం అంత భ‌యంక‌రంగా ఉంటుంది. ఎప్పుడూ తీరం
అల‌లు, ఆ అల‌ల‌ శ‌బ్దంతో ప‌ర్యాట‌కులను ఆహ్లాదం పంచే సముద్రం తుఫాన్ స‌మ‌యంలో త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తుంది. జ‌వాద్ తుఫాన్ ఇలాంటి విశాఖ తీరంలో ఇలాంటి ప్ర‌భావాన్ని చూపింది. విశాఖ బీచ్ మొత్తం దాదాపు 200 మీట‌ర్ల ముందుకు వ‌చ్చింది. దీంతో ప‌ర్యాట‌కులు, విశాఖ వాసులు ఆందోళ‌న చెందుతున్నారు. 

తృటిలో త‌ప్పిన జ‌వాద్ ముప్పు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌వాద్ ముప్పు తృటిలో త‌ప్పిన‌ట్ల‌య్యింది. కానీ దాని ప్ర‌భావం మాత్రం క‌నిపించింది. బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం త‌రువాత వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్‌గా మారింది. దీనికి జ‌వాద్ తుఫాన్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా రాష్ట్రంతో పాటు మరో మూడు రాష్ట్రాల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అంచ‌నా వేసింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం 5 రాష్ట్రాల‌ను అప్రమత్తంగా ఉండాల‌ని సూచించింది. అలెర్ట్ అయిన ఏపీ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంది. పునారాసాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ టీంల‌ను, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను సిద్ధంగా ఉంచింది. విజ‌య‌నగ‌రం, విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం జిల్లాల‌పై ఈ తుఫాన్ ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంఛ‌నాలు వేయ‌డంతో ఆ జిల్లాల‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను ఏపీ ప్ర‌భుత్వం కేటాయించింది. అయితే ఈ తుఫాన్ ప్ర‌భావం వ‌ల్ల ఏపీలోని ప‌లు జిల్లాలో వ‌ర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిశాయి. ఆదివారం ఉద‌యం తుఫాన్ తీరం దాటే అవ‌కాశం ఉండ‌టంతో ప్రభుత్వం అలెర్ట్ గా ఉంది. అయితే అదృష్ట‌వశాత్తు ఏపీకి తుఫాన్ ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళఖాతం నుంచి ఉత్త‌ర దిశ‌గా క‌దిలిన తుఫాను ఏపీని నుంచి దిశ మార్చుకొని ఒడిశా వైపు వెళ్లింది. విశాఖ‌కు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృత‌మై ఉంది. ఆ వాయుగుండం బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అది అల్ప‌పీడ‌నంగా మారి బెంగాల్ వైపు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. జ‌వాద్ తుఫాన్ ఏపీపై చాలా ప్ర‌భావం చూపుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌న‌ట్టుగా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

https://telugu.asianetnews.com/andhra-pradesh/cyclone-jawad-weakens-into-deep-depression-imd-r3mi7f

స‌ముద్ర‌తీరాల‌కు న‌ష్టం..
జ‌వాద్ తుఫాన్ ఏపీపై ప్ర‌భావం పెద్ద‌గా చూప‌న‌ప్ప‌టికీ.. బీచ్‌ల‌కు మాత్రం తీవ్ర న‌ష్టాన్ని చేకూర్చింది. విశాఖ తీరం చాలా ముందుకు వ‌చ్చింది. దాదాపు 200 మీట‌ర్ల వ‌ర‌కు కోత‌కు గుర‌య్యింద‌ని అధికారులు తెలిపారు. ఇప్ప‌టికీ తుఫాన్ ప్ర‌భావం వ‌ల్ల తీరంలో అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఆర్కే బీచ్ ప్రాంగ‌ణంలో పిల్ల‌లు ఆడుకోవ‌డానికి ఏర్పాటు చేసిన వ‌స్తువులు అన్నిచింద‌ర‌వంద‌ర‌గా మారిపోయాయి. బ‌ల్ల‌లు, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. బీచ్ ప‌రిస‌రాల్లో ఉన్న చిన్నారుల పార్క్ కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం అయ్యింది. పార్క్ వ‌ద్ద‌కూడా అంత‌చింద‌ర వంద‌ర‌గా త‌యారైంది. సముద్ర తీరం ప్ర‌స్తుతం అల‌జ‌డిగా ఉండ‌టంతో ప‌ర్యాట‌కుల‌ను బీచ్‌లోకి అనుమతించ‌డం లేదు. ప‌ర్యాట‌కుల‌ను అటుగా వెళ్ల‌నీయ‌కుండా పోలీసులు కపాల కాస్తున్నారు. బీచ్ పూర్తిగా కోలుకోవ‌డానికి ఇంకా రెండు, మూడు రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios