యువగళంకు లోకేష్ మంగళం పాడితే.. భువనేశ్వరి ఫ్యాషన్ షో లా బస్సు యాత్ర చేస్తున్నారు - మంత్రి రోజా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రపై మంత్రి రోజా విమర్శలు చేశారు. తాము కూడా నిజం గెలవాలనే కోరుకుంటున్నామని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా టీడీపీ నాయకుడు లోకేష్, భువనేశ్వరిలపై తీవ్ర విమర్శలు చేశారు. భువనేశ్వరి చేపట్టిన బస్సు యాత్రను ఫ్యాషన్ షోగా అభివర్ణించారు. లోకేష్ తన యువగళం పాదయాత్రను చేయలేక మంగళం పాడారని విమర్శించారు. మంగళవారం ఉదయం మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నిజం గెలిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు బతికున్నంత కాలం జైలులోనే ఉంటారని అన్నారు.
విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మూగ, బదిర బాలులు..
భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రను ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆమెకు నిజం గెలవాలని ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుపై సీబీఐ ఎంక్వేరి జరిపించాలని కోరాలని మంత్రి సూచించారు. యువగళం పాదయాత్ర చేయలేక లోకేష్ మధ్యలోనే మంగళం పాడారని మంత్రి రోజా విమర్శించారు. అయితే భువనేశ్వరి ఫ్యాషన్ షో లా బస్సు యాత్ర చేపడుతున్నారని ఎద్దేవా చేశారు.
బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. భర్తను చితకబాది, భార్యపై గ్యాంగ్ రేప్..
ఇదిలా ఉండగా.. నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. దీనికి ముందు ఆమె సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, 46 రోజులుగా జైలులో ఉంటున్న చంద్రబాబు నాయుడుకు సపోర్టుగా నిలుస్తూ రోడ్డుపైకి వస్తున్న ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపేందుకు, అలాగే టీడీపీ అధినేత అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిచేందుకు భువనేశ్వరి ఈ యాత్ర చేపడుతున్నారు.
మూఢత్వానికి మహిళ బలి.. దెయ్యం విడిపిస్తానని తాంత్రికుడి చిత్రహింసలు.. వివాహిత మృతి
ఈ యాత్ర మూడు రోజుల పాటు కొనసాగనుంది. నేడు చంద్రగిరిలో ఆమె పర్యటించి, అనంతరం తిరుమలకు రానున్నారు. తరువాత శ్రీకాళహస్తికి వెళ్లనున్నారు. మొదటి రోజు చంద్రగిరిలో పలు కార్యక్రమాల్లో పొల్గొని, పలు కుటుంబాలను పరామర్శించున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి, శ్రీకాళ హస్తిలో కూడా యాత్ర చేపట్టి, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.