జనసేనలోకి ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే ?

ichchapuram ex mla agarwal naresh joins janasena
Highlights

వచ్చే నెలలో లల్లూ జనసేనలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్(లల్లూ) జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రజాపోరాట యాత్రను   భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో  కొందరు పార్టీ నేతలు లల్లూ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో ప్రస్తావించినట్టు సమాచారం పవన్ నుంచి సానుకూల స్పందన రావడంతో.. వచ్చే నెలలో లల్లూ జనసేనలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయంపై పవన్, లల్లూల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

 

loader