రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులను (ias transfers in ap) బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డిని నియమించింది. తదుపరి ఉత్త్వులు జారీ చేసేంతవరకూ జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని పేర్కొంది.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులను (ias transfers in ap) బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డిని నియమించింది. తదుపరి ఉత్త్వులు జారీ చేసేంతవరకూ జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని పేర్కొంది. అలాగే అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను బదిలీ చేసింది. సీసీఎల్ఏగా జి. సాయిప్రసాద్ బదిలీ చేసిన ప్రభుత్వం.. సాయి ప్రసాద్‌కు రెవెన్యూ భూ రికార్డుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాద్యతలు అప్పగించింది. జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం.
ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వున్న రజత్ భార్గవకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. శశిభూషణ్ కుమార్‌ను జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసి.. సాధారణ పరిపాలన శాఖ హెచ్ఆర్, సర్వీసుల విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీ బాబుకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీపీఎస్సీ నుంచి, రవాణాశాఖ కమిషనర్ పోస్టుల నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అలాగే సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖల నుంచి నీరబ్ కుమార్‌లను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయలును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ రాజేంద్రనాధ్ రెడ్డిని ఏసీబీ డీజీగా బదిలీ చేసింది ప్రభుత్వం. దీనితో పాటు ఏపీ డీజీపీ పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారని పేర్కొంది. విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీజీగా శంకబ్రతబాగ్చిని నియమించింది. ఏపీఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగానూ అదనపు బాధ్యతలు అప్పగించింది.
