ఏపిలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కీలక ఐఏఎస్ ల బదిలీలు చేపట్టింది. కొద్దిరోజుల క్రితమే వివిధ శాఖల్లో మార్పులు చేపట్టిన జగన్ సర్కార్ తాజాగా మరోసారి అధికారులను బదిలీచూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. తాజాగా వి.ఉషారాణిని రెవెన్యూశాఖ సెక్రటరీ, నీరబ్ కుమార్ ప్రసాద్ ను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
కొద్దిరోజులక్రితమే మరోసారి పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదీలలను చేపట్టింది. ఈ బదీలీల్లో భాగంగా కొంతమందికి పోస్టింగ్ ఖరారు చేయగా మరికొందరికి సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. ఇందులోభాగంగా జియస్ఆర్‌కే విజయ్ కుమార్ కు మున్సిపల్ శాఖ కమీషనర్ తో పాటు ప్లానింగ్ కార్యదర్శి, సిఈవో గా పూర్తి స్థాయి అదనపు భాద్యతలను అప్పగించారు.
read more పోలవరంపై హైకోర్టు తీర్పు... ఇరిగేషన్ మంత్రి ఏమన్నారంటే...
అలాగే సుమిత్ కుమార్ కు ఏపి ఫైబర్ నెట్ ఎండితో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌళిక సదుపాయల కామర్స్ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయి అదనపు భాద్యతలు అప్పగించారు.అలాగే ఇసుకకు సంబంధించిన వ్యవహాల పర్యవేక్షణను కూడా ఆయనకే అప్పగించారు.
ఎం హరినారాయణ్ కు సిసిఎల్ స్పెషల్ కమీషనర్ తో పాటు పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ది శాఖకు ప్రత్యేక కార్యదర్శి గా పూర్తి స్థాయి అదనపు భాద్యతలు అప్పగించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా గ్రామసచివాలయాలు, గ్రామవాలంటీర్స్ శిక్షణ భాద్యతను కూడా ఆయనకే అప్పగించారు.
read more వీక్లీ ఆఫ్ మంచి నిర్ణయం...ఏపి పోలీస్ శాఖపై ప్రధాని ప్రశంసలు
వి. కోటేశ్వరమ్మను ప్లానింగ్ డిపార్ట్మెంట్ డిఫ్యూడి కార్యదర్శి నియమించారు. సంజయ్ గుప్తా ను సిసిఎస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా పరువురికి స్థానచలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించారు.