ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సెర్ప్ సీఈఓ పనిచేస్తున్న రాజబాబును తప్పించి ఆ స్థానంలో కృష్ణా జిల్లా జేసీ మాధవీలత నియమించారు. అయితే రాజబాబుకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా జీఎడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శివశంకర్ లోహేటి కీ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన వెలువడింది.
ఇక ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో కూడా జగన్ సర్కార్ పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది. బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంత రామును, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు స్పెషల్ సిఎస్(జీపీఎం అండ్ ఏఆర్)గా ప్రవీణ్ కుమార్, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ నియమించారు. అలాగే జయలక్ష్మికి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
