ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా నియమించింది. మొత్తం 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 1. ఇంతియాజ్‌- మైనారిటీ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి
 2. నివాస్‌ - కృష్ణా జిల్లా కలెక్టర్‌
 3. ఎల్‌ఎస్‌ బాలాజీరావు - శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌
 4. నాగలక్ష్మి - అనంతపురం జిల్లా కలెక్టర్‌
 5. గంధం చంద్రుడు- గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌
 6. గోపాలకృష్ణ రోణంకి - పాడేరు ఐటీడీఏ పీవో
 7. కె.ఎస్‌. విశ్వనాథన్‌ - ప్రకాశం జిల్లా జేసీగా (హౌసింగ్‌)
 8. ధ్యానచంద్ర - కడప జిల్లా జేసీగా (హౌసింగ్‌) 
 9. జాహ్నవి- తూర్పుగోదావరి జిల్లా జేసీగా ( హౌసింగ్‌) 
 10. ఎన్‌ మౌర్య- కర్నూలు జిల్లా జేసీగా ( హౌసింగ్‌) 
 11. ఉపుర్‌ అజయ్‌కుమార్‌-  కృష్ణా జిల్లా జేసీగా ( హౌసింగ్‌) 
 12. అనుపమ అంజలి- గుంటూరు జిల్లా జేసీగా (హౌసింగ్‌) 
 13. విదేహ కరె-  నెల్లూరు జిల్లా జేసీగా (హౌసింగ్‌) 
 14. ఎస్‌. వెంకటేశ్వర్‌- చిత్తూరు జిల్లా జేసీగా (హౌసింగ్‌)