న్యూఢిల్లీ: త్వరలోనే తాను టీడీపీలో చేరతానని మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు. ఏపీ అభివృద్దికి టీడీపీయే ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు  కిషోర్ చంద్రదేవ్ ఢిల్లీలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సుమారు గంటకు పైగా భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే టీడీపీలో చేరుతానని చంద్రదేవ్ ప్రకటించారు. బాబుతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

ఏ సీటు నుండి పోటీ చేయాలనే విషయాన్ని తాను చర్చించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో  అరకు ఎంపీ స్థానం నుండి కిషోర్ చంద్రదేవ్ పోటీ చేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుతో కిషోర్ చంద్రదేవ్ భేటీ: టీడీపీలోకే...

పవన్‌ కళ్యాణ్ ఎఫెక్ట్: సీపీఎంలోకి కిషోర్ చంద్రదేవ్?

కాంగ్రెస్‌కు కిషోర్ చంద్రదేవ్ రాజీనామా: సైకిలెక్కుతారా?