బొయిన్‌పల్లి కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దేవరకొండ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి శుక్రవారం నాడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


ఇబ్రహీంపట్నం: బొయిన్‌పల్లి కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దేవరకొండ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి శుక్రవారం నాడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ కేసుతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను పరారీలో ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లలేదని చెప్పారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్: తెరపైకి భూమా జగత్ విఖ్యాత్ పేరు, గాలింపు

ఈ నెల 5వ తేదీన బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులు కిడ్నాపయ్యారు.ఈ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహా 11 మందిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియ భర్తతో పాటు మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

హైద్రాబాద్ హఫీజ్ పేట భూ వివాదం విషయమై ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భార్గవ్ రామ్ పట్టుబడితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.