హైదరాబాద్:  పార్టీ మారుతున్నారనే వార్తలపై టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు స్పష్టత ఇచ్చారు.తాను టీడీపీలో చేరిన సమయంలోనే తనకు పూర్తిస్థాయి స్పష్టత ఉందని చెప్పారు.

శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లారు. వచ్చే ఎన్నికల్లో  తాను  నరసాపురం నుండి  టీడీపీ అభ్యర్ధిగా ఎంపీగా పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 

 తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న  వార్తల్లో వాస్తవం లేదన్నారు. కొంత కాలంగా తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆయన చెప్పారు.