పార్లమెంట్‌కు వెళ్తారో లేదో ఆయనే చెప్పాలి:ప్రభాకర్ చౌదరి

First Published 19, Jul 2018, 5:36 PM IST
Iam committed to Party discipline says Anantapur MLA prabhakar chowdary
Highlights

అనంతపురం ఎపీ జేసీ దివాకర్ రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. తన వల్ల జేసీకి ఏ రకమైన సమస్యలు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు.


అమరావతి: అనంతపురం ఎపీ జేసీ దివాకర్ రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. తన వల్ల జేసీకి ఏ రకమైన సమస్యలు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు.

గురువారం నాడు అమరావతిలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సమావేశమయ్యారు. జేసీ దివాకర్ రెడ్డితో  సంబంధాలు, ఇద్దరి మధ్య నెలకొన్నవిబేధాలపై  చంద్రబాబునాయుడు చర్చించారు.

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో కలిసి వెళ్లాలని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి బాబు సూచించారు. పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు తాను అడ్డుగా ఉన్నాననే ప్రచారాన్ని  ఆయన ఖండించారు.  సీఎం సూచనల మేరకు జేసీతో కలిసి సాగేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. 

1999లో కూడ అనంతపురం మున్సిఫల్ ఛైర్మెన్‌గా పనిచేసిన సమయంలో  రోడ్ల వెడల్పుకు తాను సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పట్టణంలోని కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో  రోడ్ల వెడల్పు విషయంలో  ఉన్న ఇబ్బందులను కూడ పట్టించుకోవాల్సిన అవసరం ఉందని  ప్రభాకర్ చౌదరి గుర్తు చేస్తున్నారు.

పార్లమెంట్‌కు వెళ్తారా లేదా అనేది  జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించాలని ఆయన చెప్పారు.ఈ విషయమై తాను ఏమీ చెప్పలేనన్నారు.  పార్టీకి ఇబ్బందులు కల్గించేలా తాను పనిచేయబోనని ఆయన చెప్పారు. మరో వైపు పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలను తీసుకురావడంపై తనకు అభ్యంతరం లేదన్నారు.

loader