త్వరలోనే రాజకీయ నిర్ణయం: ముద్రగడ పద్మనాభం

త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని  ప్రకటించనున్నట్టుగా  కాపు రిజర్వేషన్ల  ఉద్యమ నేత  ముద్రగడ పద్మనాభం  చెప్పారు.  

I will take Political decision Soon says mudragada padmanabham  lns

రాజమండ్రి:త్వరలోనే  తన   రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని  కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత  ముద్రగడ పద్మనాభం  ప్రకటించారు.ఈ మేరకు  ముద్రగడ పద్మనాభం  బుధవారంనాడు  కాపు సామాజికవర్గ ప్రజలకు  బహిరంగ లేఖ రాశారు.

తుని  రైల్వే  కేసు కొట్టివేసినందున సత్యం జయించిందని  ముద్రగడ పద్మనాభం  ఇవాళ లేఖను విడుదల చేశారు. తన జాతి  రిజర్వేషన్  జోకర్ కార్డులా  మారినందుకు  బాధపడుతున్నానని  ఆయన  ఆ లేఖలో  పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.కాపు సామాజిక వర్గానికి  రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం  డిమాండ్  చేస్తున్నారు. 

ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీల్లో  చేరాలని ప్రధాన రాజకీయ పార్టీలు  కోరాయి.  అయితే  ముద్రగడ పద్మనాభం  మాత్రం  ఇప్పటివరకు  ఏ  ఏ నిర్ణయం తీసుకోలేదు.  అయితే  ఇవాళ  లేఖలో  మాత్రం  తన రాజకీయ భవిష్యత్తును  త్వరలోనే  ప్రకటించనున్నట్టుగా  ముద్రగడ పద్మనాభం  ప్రకటించడం  ఏపీ రాజకీయాల్లో  ప్రాధాన్యత కల్గించింది. 

జనసేన, బీజేపీ  నేతలు  గతంలో  ముద్రగడ పద్మనాభంతో  చర్చలు  జరిపారు.  చంద్రబాబునాయుడు  ప్రభుత్వం  అధికారంలో  ఉన్న సమయంలో  కాపు  రిజర్వేషన్ల కోసం  ముద్రగడ పద్మనాభం  పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.  2016లో తునిలో  రైలు దగ్దమైంది. ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 

ఏపీ రాష్ట్రంలో  వచ్చే  ఏడాది  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో   ముద్రగడ పద్మనాభం    రాజకీయ నిర్ణయం  ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పులకు   అవకాశం లేకపోలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ముద్రగడ పద్మనాభం  కాంగ్రెస్, టీడీపీలలో  పనిచేశారు. ఆ తర్వాత  ఈ రెండు పార్టీలకు దూరంగా ఉన్నారు. కాపు  రిజర్వేషన్ల కోసం  పోరాటం  చేస్తున్నారు.  రాష్ట్ర విభజన తర్వాత  కాపు రిజర్వేషన్ల విషయంలో  ముద్రగడ పద్మనాభం  తన ఉద్యమాన్ని మరింత  ఉధృతం  చేశారు. 

also read:తుని రైలు దగ్ధం :ముద్రగడ, దాడిశెట్టి సహా 41 మందిపై కేసు కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాపు సామాజిక వర్గానికి  సుమారు  12 శాతానికి పైగా ఓటర్లుంటారు.  కొన్ని  అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా  పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములను  కాపు సామాజిక ఓటర్లు  ప్రభావితం  చేయనున్నారు.  దీంతో  కాపు సామాజిక వర్గం ఓటర్లను  తమ వైపునకు తిప్పుకనేందుకు  ఏపీలోని ప్రధాన పార్టీలు  ప్రయత్నాలు చేస్తుంటాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios