నా భర్త పార్టీ మారితే ఆయన అడుగు జాడల్లోనే: మాజీ మంత్రి మేకతోటి సుచరిత
తన భర్త పార్టీ మారితే తాను కూడా మారుతానని మాజీ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. తమ కుటుంబమంతా ఒకే పార్టీలో ఉండాలన్నదే తమ పార్టీ అభిమతమన్నారు.
గుంటూరు: తన భర్త పార్టీ మారితే తాను కూడా మారుతానని మాజీ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. తమ కుటుంబమంతా ఒకే పార్టీలో ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు.బుధవారంనాడు గుంటూరు జిల్లా కాకునూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నా భర్త ఓ పార్టీలో, తాను ఓ పార్టీలో తమ పిల్లలు వేరో పార్టీలో ఉండొద్దని తమ అభిమతమన్నారు. దయాసాగర్ పార్టీ మారుతాను.... నువ్వు నాతో రా అంటే తాను ఎంత రాజకీయనాయకురాలినైనా భార్యగా తాను భర్త అడుగు జాడల్లో నడుస్తానని ఆమె వివరించారు. ఒకే కుటుంబంలో ఉన్న వారిలో కూడ అభిప్రాయబేధాలు సహజమన్నారు. అంత మాత్రాన వారంతా వేరు కాదన్నారు.
తమ రాజకీయ జీవితం వైసీపీతోనే ముడిపడి ఉందని సుచరిత వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్ తో కలిసి ఉండాలన్నదే తమ అభిమతంగా సుచరిత పేర్కొన్నారు. 2018లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.జగన్ తొలి కేబినెట్ లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ పునర్వవ్యవవస్థీకరణలో సుచరితకు కేబినెట్ నుండి తప్పించారు. హోంమంత్రిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తానేటి వనిత బాధ్యతలు అప్పగించారు.