బాలకృష్ణ సహకారం, కనిగిరి సీటు నాదే: బాబురావు

I will contest second time from Kanigiri says MLA Kadiri Baburao
Highlights

2019‌లో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తానే పోటీ చేస్తానని ఎమ్మెల్యే  కదిరి బాబురావు చెప్పారు. రాజకీయంగా మనుగడ కోల్పోయిన కొందరు స్వార్థపరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన విమర్శించారు. 

ఒంగోలు: 2019‌లో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తానే పోటీ చేస్తానని ఎమ్మెల్యే  కదిరి బాబురావు చెప్పారు. రాజకీయంగా మనుగడ కోల్పోయిన కొందరు స్వార్థపరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన విమర్శించారు. 

ప్రకాశం జిల్లా  కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా తానే బరిలో నిలుస్తానని ఆయన చెప్పారు.  తనకు టిక్కెట్టు రాదని  కొందరు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు టిక్కెట్టు రాదని  ప్రచారం చేస్తున్న నేతలు పగటికలలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. 

ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.  కనిగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబునాయుడు సహకారంతో అభివృద్ధి చేసినట్టు ఆయన చెప్పారు.ఈ విషయంలో తన మిత్రుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడ సహకరించారని ఆయన గుర్తు చేశారు.

ఈ నెల 28న ఒంగోలు నిర్వహించే ధర్మపోరాట దీక్షకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు హజరుకావాలని ఆయన కోరారు.  పార్టీ శిక్షణ కార్యక్రమాలకు కూడ పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన సూచించారు. 

 ఈ వార్త చదవండి: జగన్ ట్రాప్‌లో పడలేదు, కేసీఆర్‌ను మోడీ పొగిడితే నాకేం కాదు: బాబు

 

loader