అనంతపురం:తాను పోలీసులను దూషించలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. 

సోమవారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ వ్యక్తి తనను, పరిసరాలను ఫోన్ లో చిత్రీకరిస్తోంటే దూషించానని ఆయన తెలిపారు.

149 సీఆర్‌పీసీ , 30 యాక్ట్ కింద పోలీసులు నోటీసిచ్చారన్నారు. దీక్ష శిబిరానికి వెళ్లకుండా తనను పోలీసులు అడ్డుకొన్నారని ఆయన చెప్పారు. 

సోమవారం నాడు  ఉదయం  దివాకర్ రెడ్డి ఉన్న ఫామ్ హౌస్ వద్దకు వెళ్లిన తనపై  జేసీ దివాకర్ రెడ్డి దూర్భాషలాడినట్టుగా డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇష్టారీతిలో మాట్లాడితే ఊరుకోబోమని ఆయన జేసీ దివాకర్ రెడ్డిని హెచ్చరించారు. తాడిపత్రిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దుర్వినియోగం అవుతోందని  తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఇవాళ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

జేసీ దివాకర్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష శిబిరం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకొన్నారు.  ఈ సమయంలోనే పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారని  వైసీపీ ఆరోపిస్తున్నారు.