అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. నేను నరకం చూస్తున్నా అందుకే దేవుడి దగ్గరికి వెడుతున్నా అంటూ ఓ డిగ్రీ విద్యార్థి తల్లిదండ్రులకు లేఖ రాసి ఓ డిగ్రీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మార్జేపల్లెలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివశంకర్, పద్మజలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు గణేష్ పలమనేరులోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 21వ తేదీన గణేష్ కాలేజీ నుంచి కనిపించకుండా పోయాడు.
అతని టూ వీలర్, బుక్స్ కూడా కనిపించలేదు. చాలా చోట్ల వెతికినా అతని ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో గణేష్ వెళ్లిపోయేటప్పుడు తల్లిదండ్రులకు ఓ లెటర్ రాసి పెట్టాడు.. ఆ లేఖలో ‘నేను బాధను మరువ లేకున్నా.. నరకం చూస్తున్నా.. అందుకే దేవుడి దగ్గరికి వెడుతున్నా.. తమ్ముడు జాగ్రత్త.. నాన్నా నీకు చెడ్డపేరు తెచ్చి ఉంటే క్షమించు.. తమ్ముడికి కొడుకుగా పుడతా.. మీరే నన్ను పెంచి పెద్ద చేయండి. అప్పుడు మీరు చెప్పినట్లే నడుచుకుంటా..’ అని రాశాడు.