పవన్ కంటే నేనే బెటర్.. అక్కడి నుంచి పోటీ చేస్తా: కేఏ పాల్ సంచలనం
పవన్ కళ్యాణ్ కంటే తానే బెటర్ అని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ చెప్పారని కేఏ పాల్ అన్నారు. తనకు అన్ని వర్గాల మద్దతు ఉన్నదని వివరించారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు.

అమరావతి: కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే తానే బెటర్ అని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ చెప్పారని కామెంట్లు చేశారు. తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉన్నదని చెప్పారు. తనకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలోనూ ప్రజా మద్దతు ఉన్నదని వివరించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన పోయి.. కేఏ పాల్ పాలన రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు.
అంతేకాదు, ఆయన మరో కీలక విషయాన్ని వెల్లడించారు. తాను అసెంబ్లీ బరిలో ఉండబోరని, లోక్ సభ ఎన్నికల బరిలో ఉంటానని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడైన కేఏ పాల్ తెలిపారు. తాను విశాఖ నుంచి లోక్ సభ ఎన్నికలకు పోటీ చేస్తానని వివరించారు.
నవంబర్ 9వ తేదీన విశాఖ పట్నంలో గ్లోబల్ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు కేఏ పాల్ తెలిపారు. ఆ కార్యక్రమం నుంచే 200 దేశాలకు క్రీస్తు సందేశాన్ని ఇవ్వబోతున్నట్టు వివరించారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమానికి అందరూ విచ్చేయాలని కోరారు. భోజనం చేసి వెళ్లాలని అన్నారు.