జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిపై చిత్తూరు జిల్లా కందూరులో వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే.  హైపర్ ఆది మాట్లాడుతుండగా.. వైసీపీ నేతలు అడ్డుకొని సభను రసాభాస చేశారు. ఆదిపై దాడి కూడా చేశారు. కాగా.. ఈ ఘటనపై తాజాగా హైపర్ ఆది స్పష్టతనిచ్చారు.

‘‘ఏదో నాలుగు స్కిట్లు చేస్తూ.. సినిమాల్లో నటిస్తూ నాలుగు డబ్బులు సంపాదిస్తే అదే జీవితం అంటే మనసు ఒప్పుకోవడం లేదు. చాలా మందిలాగానే నేను బాగా చదువుకున్నాను. ఒక సబ్జెట్ గురించి విన్న వింటనే నేను బాగా అర్థం చేసుకోగలను. వాటిని ఎదుటివారికి అర్థమయ్యేలా కూడా చెప్పగలను. నాకు ప్రసంగాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలనుకున్నాను. అందులో నాకు తృప్తి ఉంది. ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి బాస్. మళ్లీ ఇలా సినిమాలు చేసుకుంటాను. జబర్దస్థ్ రీ ఎంట్రీ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను’’ అని ఆది పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో కూడా ఈ సందర్భంగా ఆది పేర్కొన్నారు. ‘‘ ఓటు వేసే ముందు ఒక పేపర్ పై చంద్రబాబు , జగన్, పవన్ ఇలా ముగ్గురి పేర్లు రాసి.. వాళ్ల పాజిటివ్స్, నెగిటివ్స్ రాయండి. వాటి ఆధారంగా ఓటు వేసి నిజమైన నాయకుడిని ఎన్నుకోండి’’ అంటూ ఆది హితవు పలికారు. 

read more news

జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిపై దాడి

హైపర్ ఆదిపై దాడి (వీడియో)