పోటెత్తిన మున్నేరు వరద, హైద్రాబాద్-విజయవాడ హైవే రేపటి వరకు మూసివేత: సీపీ కాంతిరాణా టాటా
హైద్రాబాద్-విజయవాడ హైవేను నందిగామ వరకు రేపటివరకు మూసివేస్తున్నామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు.
విజయవాడ:హైద్రాబాద్-విజయవాడ హైవేను నందిగామ వరకు రేపటి వరకు మూసివేస్తున్నామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా చెప్పారు.హైద్రాబాద్-విజయవాడ హైవేపై ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐతవరం వద్ద మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇవాళ ఉదయం నుండి వాహనాలను దారి మళ్లించారు.
హైద్రాబాద్- విజయవాడ హైవేను నందిగామ వరకు రేపటి వరకు మూసివేస్తున్నట్టుగా విజయవాడ సీపీ కాంతి రాణా టాటా మీడియాకు చెప్పారు. మున్నేరు నది వరద నీరు జాతీయ రహదారిపై రెండు చోట్ల ప్రవహిస్తుంది.
దీంతో హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను మళ్లించాల్సిన పరిస్థితి నెలకొందని సీపీ కాంతి రాణా టాటా వివరించారు. మున్నేరు వరద పరిస్థితిని సమీక్షించిన తర్వాత జాతీయ రహదారిపై వాహనాలను అనుమతించనున్నట్టుగా సీపీ తెలిపారు.విజయవాడ నుండి హైద్రాబాద్ వెళ్లాలంటే మైలవరం, తిరువూరు మీదుగా వెళ్లాలని సీపీ సూచించారు. లేదా విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నార్కట్ పల్లి మీదుగా హైద్రాబాద్ వెళ్లాలని ఆయన కోరారు. వైజాగ్ నుండి విజయవాడ మీదుగా హైద్రాబాద్ వెళ్లేవారంతా జంగారెడ్డి గూడెం ,ఆశ్వరావుపేట, సత్తుపల్లి మీదుగా హైద్రాబాద్ కు వెళ్లాలని సీపీ తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐతవరం మండలం కీసర వద్ద ఉన్న బ్రిడ్జిపై మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నిన్న సాయంత్రం నుండి రాకపోకలను నిలిపివేశారు.రేపటి వరకు కూడ ఇదే పరిస్థితి ఉంటుందని సీపీ కాంతి రాణా చెప్పారు.
also read:పెనుగంచిప్రోలు బ్రిడ్జిపై నుండి మున్నేరు వరద: తెలంగాణ, ఏపీకి రాకపోకల నిలిపివేత
మున్నేరు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ఈ నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో పోలీసులు హైద్రాబాద్-విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై నందిగామ వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బ్రిడ్జిపై వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బ్రిడ్జిని అత్యవసర పరిస్థితుల్లో దాటేందుకు భారీ క్రేన్ ను ఉపయోగిస్తున్నారు పోలీసులు.