రోడ్డు మీద పది రూపాయాలు కనిపిస్తే.. ఎవ్వరికి కనిపించకుండా జేబులో పెట్టుకోవడమే కాకుండా.. ఎవరైనా వచ్చి అడిగితే నాది అని గొడవ పడటానికి కూడా రెడీగా ఉంటారు కొందరు. అయితే రూ.10 లక్షలు ఉన్న బ్యాగ్ దొరికితే ఇంకేమైనా ఉందా.. కానీ ఏ మాత్రం ఆశపడకుండా ఆ బ్యాగ్‌ను దానిని పొగొట్టుకున్న వారికి అప్పగించిన వ్యక్తిని చూశారా
రోడ్డు మీద పది రూపాయాలు కనిపిస్తే.. ఎవ్వరికి కనిపించకుండా జేబులో పెట్టుకోవడమే కాకుండా.. ఎవరైనా వచ్చి అడిగితే నాది అని గొడవ పడటానికి కూడా రెడీగా ఉంటారు కొందరు. అయితే రూ.10 లక్షలు ఉన్న బ్యాగ్ దొరికితే ఇంకేమైనా ఉందా.. కానీ ఏ మాత్రం ఆశపడకుండా ఆ బ్యాగ్‌ను దానిని పొగొట్టుకున్న వారికి అప్పగించిన వ్యక్తిని చూశారా.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటకు చెందిన కొత్తూరు కృష్ణ, ప్రసాద్ అన్నదమ్ములు వారు హైదరాబాద్ గచ్చిబౌలీలోని శ్రీరామ్‌నగర్ ఏరియాలో ఓ ఫ్లాట్ కొనాలనుకున్నారు. దీనిలో భాగంగా బుధవారం బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు విత్ డ్రా చేసుకుని ఆటోలో వస్తున్నారు.
అయితే ఆ సమయంలో కంగారులో డబ్బు ఉన్న బ్యాగును ఆటోలోనే మరచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ జార్పుల రమేశ్ అందులో రూ.10 లక్షల డబ్బు ఉండటాన్ని గమనించాడు. ఎంతోమంది తన ఆటో ఎక్కుతారు కాబట్టి .. మరచిపోయిన వారు ఎవరో గుర్తించలేకపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును అప్పగించారు.
అయితే అప్పటికే కృష్ణ, ప్రసాద్ సోదరులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారి సమక్షంలోనే పోలీసులు బ్యాగును వారికి అప్పగించారు. నిజాయితీతో బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్‌ను పోలీస్ అధికారులు ప్రశంసించారు.
