నాలుగేళ్ల క్రితం వారు తమ కాపురాన్ని పట్టణానికి మార్చారు. సాహేబ్ పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇటీవల స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరింది. ఈ క్రమంలో భార్య ఫాతిమా వివాహేతర సంబంధంపై భర్త నిలదీస్తూనే ఉన్నాడు.
ఆమెకు వివాహమై 14 సంవత్సరాలు అవుతోంది. బంగారం లాంటి భర్త, ముత్యల్లాంటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ కాదని ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్కడితే ఆగకుండా... ఇంట్లోని బంగారమంతా తీసుకెళ్లి... ప్రియుడికి అప్పజెప్పింది. భార్య చేస్తున్న అరాచకాలను తట్టుకోలేని భర్త ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన ఎస్ కే ఫాతిమా(32) మండంలోని తాళ్లూరు ప్రాంతానికి చెందిన ఎస్ కే పాచ్ఛా సాహెబ్ అలియాస్ పాచ్ఛాతో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా... కొంతకాలంగా భార్యభర్తల మధ్య కొన్ని విషయాల్లో మనస్పర్థలు వస్తున్నాయి.
దీంతో.. నాలుగేళ్ల క్రితం వారు తమ కాపురాన్ని పట్టణానికి మార్చారు. సాహేబ్ పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇటీవల స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరింది. ఈ క్రమంలో భార్య ఫాతిమా వివాహేతర సంబంధంపై భర్త నిలదీస్తూనే ఉన్నాడు.
అంతేగాక ఆమె తన ప్రియుడికి ఇంట్లోని బంగారు ఆభరణాలు కూడా ఇచ్చింది. ఈ వ్యవహారంపై కూడా కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గోడవలు తీవ్ర తరమయ్యాయి. అదే విషయాన్ని భార్య ఫాతీమాను భర్త గట్టిగా నిలదీశాడు. ఆమె ఆయనపై ఎదురు దాడికి దిగింది.
AlsoRead వంశీ మదిలో వైసీపీ: కేశినేనితో చర్చల తర్వాతే నిర్ణయం, గమనిస్తున్న యార్లగడ్డ
ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. ఆగ్రహం చెందిన భర్త.. ఆమె ముఖాన్ని కాల్చాడు. ఆపై తీవ్రంగా కొట్టి చపాతి కర్రతో గొంతు నులిమి చంపాడు. భార్య ఉరేసుకుని చనిపోయిందని నమ్మబలికే ప్రయత్నంలో భాగంగా ఫ్యానుకు చీర కట్టాడు. తమ కుమార్తెను అల్లుడే అనుమానంతో చంపాడని మృతురాలి తల్లి ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు.
సంఘటన స్థలాన్ని డీఎస్పీ, సీఐ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తానే తన భార్యను చంపినట్లు భర్త పాచ్ఛా అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
