ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య తన భర్తనే హతమార్చింది. అనంతరం డెడ్ బాడీని ఓ కాల్వలో పడేసింది. కాగా, మృతుడి కుటుంబీకులు ఆయన కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను తన ప్రియుడితో కలిసి హతమార్చినట్టు భార్య అంగీకరించింది. ఆ కాల్వలో గాలింపులు చేపట్టగా ఆమె భర్త మృతదేహం లభించింది. 

అమరావతి: గుంటూరు(Guntur) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యింది.. ఏడు అడుగులు వేసి ఏకమయ్యింది వారు మరిచారు. వారి దాంపత్యంలోకి పరాయి వ్యక్తి ప్రవేశించాడు. ప్రియుడితో కలిసి ఆ భార్య(Wife) ఏకంగా భర్త(Husband)ను హతమార్చింది. అంతేకాదు, ఆ హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని(Dead Body) ఎవరికి కనిపించకూడదని ఓ కాల్వలో పడేశారు. కానీ, నాగరాజు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన నాగరాజు జాడ గురించి దర్యాప్తు చేయగా నిందితులు నేరానికి పాల్పడ్డట్టు అంగీకరించారు.

మంగళగిరి నియోజకవర్గానికి చెందిన తాడేపల్లి వాస్తవ్యుడు నాగరాజు. షేమ సోనిని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరు దంపతులు కొంతకాలం క్రితం పొన్నూరుకు మారారు. అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవించారు. అయితే, సోనీకి అదే కాలనీకి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కలిసి వారికి అడ్డుగా ఉన్న నాగరాజును మొత్తంగా అడ్డు తొలగించాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారు ఇద్దరూ కలిసి నాగరాజును హతమార్చాలనే ప్లాన్ వేశారు. ఈ నెల 7న ఇంట్లోనే నాగరాజును వారు హతమార్చారు. డెడ్ బాడీని బాపట్ల మండలం అప్పిగట్ల సమీపంలోని కాలువలో పడేశారు.

కాగా, కొన్ని రోజులుగా నాగరాజు కనిపించకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనుమానం వ్యక్తపరిచారు. అందుకే వారు నాగరాజు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు నిందితులు తామే నాగరాజును హతమార్చినట్టు ఒప్పుకున్నారు. హత్య చేసి అనంతరం ఆ డెడ్ బాడీని కాలువలో పడేసినట్టు తెలిపారు. వారి సమాచారం మేరకు పోలీసులు ఆ కాల్వలో గాలింపులు జరిపారు. నాగరాజు మృతదేహం లభించింది. అనంతరం ఆ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఆ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్టు అర్బన్ సీఐ శరత్ బాబు తెలిపారు.

ఐదు రోజుల క్రితం భార్య కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ రావడాన్ని గమనించిన నరసింహ అప్పటినుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు. ఆమెతో గొడవకు దిగి కోపోద్రిక్తుడై క్షణికావేశంలో విద్యుత్ వైర్ తో లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లికి చెందిన అల్వాల నరసింహకు మహేశ్వరం మండలం మాణిక్యమ్మ గూడ కు చెందిన లక్ష్మమ్మ అలియాస్ మంగమ్మ (30) తో 2005 లో వివాహం అయ్యింది. 

పెళ్లి అయిన కొన్ని రోజులకే నరసింహ అత్తగారి ఊరికి మకాం మార్చాడు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. నరసింహ మేస్త్రి, డ్రిల్లింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 5 రోజుల క్రితం భార్య కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి phone call రావడాన్ని గమనించిన నరసింహ అప్పటినుంచి ఆమెపై suspicious పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు. ఆదివారం రాత్రి liquor తాగి ఇంటికి వచ్చాడు. ఇదే విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మరోసారి గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడై క్షణికావేశంలో విద్యుత్ వైర్ తో లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి murder చేశాడు.