రాజమండ్రి: భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకొంది.

రాజమండ్రి గ్రామీణ మండలం బొమ్మూరులోని వెంకటేశ్వరనగర్-2 లో నివాసం ఉంటున్న చిరంజీవి రామచంద్రరాజు ఓ దినపత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేస్తున్నాడు.  ఆయన వయస్సు 50.  ఆయన భార్య నాగలక్ష్మి వయస్సు 45 ఏళ్లు. నాగలక్ష్మి ఇటీవల అనారోగ్యం బారినపడ్డారు. 

శుక్రవారంనాడు ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వచ్చారు. శనివారం నాడు నాగలక్ష్మి తెల్లవారుజామున నాగలక్ష్మి అస్వస్థతకు గురికావడంతో ఆమె సోదరుడు ఆసుపత్రికి తీసుకెళ్లుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.

ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రామచంద్రరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. భార్య చనిపోయిన విషయం తెలియగానే రామచంద్రరాజు మృతి చెందినట్టుగా కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

రామచంద్రరాజు కొడుకు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రామచంద్రరాజు కూతురు ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఒకే రోజు ఒకే కుటుంబంలో ఇద్దరూ మృతి చెందడంతో  ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లీదండ్రులు ఇద్దరూ మరణించడంతోో పిల్లల రోధనలు పలువురిని కంటతడిపెట్టిస్తున్నాయి.