నెల్లూరు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అక్రమ సంబంధాల ఘటనలు వెలుగు చూశాయి. కృష్ణా జిల్ాల గుడివాడలో భర్త రాసలీలలను అతని భార్య బయట పెట్టింది. ప్రేయసితో రాసలీలలు జురపుతున్న భర్తను ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

వరకట్నం పేరుతో రెండేళ్ల క్రితం భార్య లక్ష్మిని శ్రీనివాస రావు అనే వ్యక్తి పుట్టింటికి పంపించాడు. ఆ తర్వాత గన్నవరం మండలం దావాజీగూడెంలో ప్రేయసితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే, బంధువులతో కలిసి వచ్చిన భార్య అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. లక్ష్మి, ఆమె బంధువులు గన్నవరం పోలీసులకు ఫిర్యాుదు చేశారు. నిందితుడు గొరిపర్తి శ్రీనివాస రావు గుడివాడ ఫైర్ స్టేషన్ లో ఫైర్ మన్ గా పనిచేస్తున్నాడు.

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం నెరుపుతున్న మహిళా ఎస్సై గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంపై కానిస్టేబుల్ పెంచల సాయి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దాంతో మహిళా ఎస్సైని దిశ పోలీసు స్టేషన్ నుంచి బదిలీ చేసి వీఆర్ కు పంపించారు.

ఆ తర్వాత కూడా వారిద్దరి మధ్య వ్యవహారం కొనసాగుతుండడంతో కానిస్టేబుల్ భార్య మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా ఎస్సై కానిస్టేబుల్ భార్యపై మండిపడింది. పదే పదే ఫిర్యాదు చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాకు సమాచారం ఇవ్వడంతో మహిళా ఎస్సై అక్కడి నుంచి జారుకుంది.