Kurnool: అనుమానం పెనుభూతంగా మారింది. పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. అనుమానంతో భార్యను ఓ భర్త హతమార్చాడు. ఈ దారుణ ఘటన మంత్రాలయం రూరల్ లోని మాధవరం తండా గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
Kurnool: అనుమానం పెనుభూతంగా మారింది. పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. అన్యోన్యంగా కలిసి కాపురం చేసుకుంటున్న భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టించింది. గొడవలకు కారణమైంది. అంతేకాదు క్షణికావేశంలో భార్యపై దాడి చేసి.. హతమార్చాడు. చివరికి ఓ భర్త హంతకుడిగా మారాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ దారుణ ఘటన మంత్రాలయం రూరల్ లోని మాధవరం తండా గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, మాధవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరం తండాకు చెందిన గోవిందనాయక్ వంట మాస్టారుగా పనిచేస్తున్నాడు. ఈయనకు 15 సంవత్సరాల క్రితం విజయాబాయితో వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది. అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు. భార్యపై అనుమానంతో భర్త గోవిందనాయక్ శాడిస్ట్ లా మారాడు. ఆమెను నిత్యం అనుమానంతో వేధించసాగాడు.
ఈ క్రమంలో ఆదివారం ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవలో క్షణికావేశంతో భర్త గోవిందనాయక్, ఇన్ని సంవత్సరాల నుంచి తనతో కలిసి జీవనం సాగిస్తున్న భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో విజయాబాయిని(35) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేసిన హత్య చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గోవిందునాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అనుమానం, క్షణికావేశం భర్తను హత్య చేసి.. తన సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడు. భర్య ను హత్య చేసి.. అతడు హంతకుడిగా మారి, తన పిల్లలను ఆనాథలుగా మార్చాడు. ఆయన భవిషత్యు తన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిపోయాడు. గోవిందనాయక్ లాంటి వ్యక్తులు ఎంతోమంది భార్యపై అనుమానంతో వారిని అత్యంత దారుణంగా హత మారుస్తున్నారు. స్వతహాగా నేరప్రవృత్తి ఉన్నవారు కానప్పటికీ, క్షణికావేశంలో విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు. తత్ఫలితంగా ఓ నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోవడమే కాకుండా.. పిల్లలు తల్లిదండ్రులు దూరమైన అనాథలుగా మారారు.
