Asianet News TeluguAsianet News Telugu

నిర్జన ప్రదేశంలో భార్యను కత్తితో పొడిచి హత్య, ఆ పై ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగిన భర్త.

నెల రోజుల క్రితం ఇద్దరూ మాట్లాడుకుని అప్పికట్ల లోనే  కలిసి ఉంటున్నారు.  ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై  పర్చూరు,  కారంచేడు ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లి  సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు.  రాత్రి  తిమ్మసముద్రం బయలుదేరారు.  

husband assassinated wife over family dispute and committed suicide in andhra pradesh
Author
Hyderabad, First Published Oct 19, 2021, 9:20 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చిన్నగంజాం :  ఓ వ్యక్తి ప్రణాళిక ప్రకారం తన భార్యను నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.  ఆ తరువాత సొంత ఊరు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.  సోమవారం ఉదయం వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.  

చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలకే భార్యభర్తలు విడిపోవడం, విపరీతంగా కొట్టుకోవడం మామూలుగా మారిపోయింది. అయితే కొంతమంది ఇంతటితో ఆగకుండా హత్యలకూ వెనకాడడం లేదు. అలా కాపురంలో కలతల కారణంగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడో భర్త. ఆ తరువాత చేసిన తప్పు తెలిసిపోతుందనుకున్నాడో.. ఏమో తెలియదు కానీ తానూ 
Poison తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

Chinnaganjam ఎస్సై పి అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం…  గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల కు చెందిన  మామిళ్ళపల్లి శ్రీనివాసరావుకు.. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన  మాధవి (30)తో  14 ఏళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో వీరిద్దరి కాపురం అన్యోన్యంగా సాగేది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  

కాలక్రమంలో వీరిద్ధరి మధ్య... వివిధ కారణాలతో తరచుగా గొడవలు వస్తుండేవి. భార్యభర్తల మధ్య గొడవలు రావడం పెద్ద విషయం కాదు. కానీ అవి వారు విడిపోయేవరకు దారి తీశాయి. దీంతో ఏడాది కాలంగా శ్రీనివాసరావు, మాధవిలు వేర్వేరుగా ఉంటున్నారు.  శ్రీనివాస రావు పిల్లలతో కలిసి  అప్పికట్ల లోనే  ఉంటున్నాడు.  మాధవి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ హైదరాబాద్ లో ఉండేది.

నెల రోజుల క్రితం ఇద్దరూ మాట్లాడుకుని అప్పికట్ల లోనే  కలిసి ఉంటున్నారు.  ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై  పర్చూరు,  కారంచేడు ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లి  సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు.  రాత్రి  తిమ్మసముద్రం బయలుదేరారు.  

ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి కుతూహలమ్మ రాజీనామా

శ్రీనివాసరావు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం  Vetapalam, Santaravoor  గ్రామాల మధ్య ఆలేరు  కాలువ కట్ట పైకి మాధవి ని తీసుకు వెళ్ళాడు.  అక్కడ ఆమెపై కత్తితో పొడిచి Murder చేశాడు.  సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో అటుగా వెళ్ళిన కొందరు స్థానికులు dead body ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. 

చీరాల డి ఎస్ పి శ్రీకాంత్,  ఇంకొల్లు సీఐ  సుబ్బారావు,  చిన్నగంజాం ఎస్ఐ అంకమ్మరావు సంఘటనా స్థలానికి చేరుకుని  వివరాలు సేకరించారు.  మృతురాలు మాధవి గా గుర్తించారు.  ఆమె తల్లి లక్ష్మి  సంఘటనా స్థలానికి చేరుకుని హృదయవిదారకంగా రోధించారు.  

మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  భార్యను హత్య చేసిన శ్రీనివాసరావు..  ఆ తరువాత నేరుగా స్వగ్రామానికి చేరుకుని..  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  స్థానికులు గుర్తించి అతడిని పొన్నూరు లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకున్న తరువాత భార్యను చంపాడానికి అసలు కారణాలేంటో దర్యాప్తు మొదలు పెడతామని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాల వల్లనేనా, మరేదైనా కారణాలా? ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios