Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లాలో రెండు వజ్రాలు లభ్యం: విదేశీ సంస్థలు కూడా అన్వేషణ

కర్నూల్ జిల్లాలో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వజ్రాల కోసం పలువురు రోజుల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు.

Hunt for diamonds begins in several Kurnool villages of Andhra Pradesh
Author
Kurnool, First Published Aug 13, 2020, 12:30 PM IST


కర్నూల్: కర్నూల్ జిల్లాలో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వజ్రాల కోసం పలువురు రోజుల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇటీవల కాాలంలో రెండు వజ్రాలు లభ్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది.  జిల్లాలోని జొన్నగరిలో వ్యవసాయ కూలీకి  ఒక వజ్రం మూడు రోజుల క్రితం దొరికిందని స్థానికులు చెబుతున్నారు. మరో వైపు ఈ వజ్రాన్ని వ్యవసాయకూలీ స్థానికంగా ఉన్న వ్యాపారికి వజ్రాన్ని విక్రయించినట్టుగా తెలుస్తోంది. ఈ వజ్రం తీసుకొని రూ. 3 లక్షలు చెల్లించినట్టుగా సమాచారం.

మరో వైపు తుగ్గలికి చెందిన మరో కూలీకి కూడ వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని వ్యవసాయ కూలీ వ్యాపారికి విక్రయించాడు. అయితే ఈ వ్యాపారి వ్యవసాయ కూలీకి నగదు ఇచ్చినట్టుగా చెబుతున్నారు.వర్షాకాలంలో వజ్రాల కోసం పెద్ద ఎత్తున  స్థానికులు  పొలాల్లో వెతుకుతుంటారు. చాలా కాలంగా జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 


జిల్లాలో రెండు వజ్రాలు లభ్యం కావడం సంచలనం రేపుతోంది. జొన్నగిరిలో వ్యవసాయ కూలీకి ఒకటి, తుగ్గలికి చెందిన మరో కూలీకి వజ్రాలు దొరికాయి. ఈ రెండు వజ్రాలను వ్యాపారులు మూడు లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

జిల్లా వాసులే కాదు అనంతపురం, కడప, ప్రకాశం, కర్ణాటకలోని బళ్లారి, తెలంగాణలోని పలువురు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతుంటారు. 

జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరా, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లో వజ్రాల కోసం ఏళ్ల తరబడి వెతుకుతుంటారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుండి నవంబర్ వరకు పొలాల్లో వెతుకుతుంటారు. 

also read:అదృష్టమంటే ఆయనదే: లైజర్ కు మరోసారి దొరికిన రత్నం

విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయుడు, ఆయన మంత్రి తిమ్మరుసు  ఆలయం సమీపంలో వజ్రాలు, బంగారం ఆభరణాల నిధిని దాచిపెట్టారని స్థానికులు నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా సిరివెళ్ల మండల ప్రధాన కార్యాలయంలోని నరసింహా ఆలయం చుట్టూ వజ్రాల కోసం అన్వేసిస్తారు.

కొన్ని విదేశీ సంస్థలు, సైంటిస్టులు, అమెరికా, అస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఐదేళ్లుగా వజ్రాల కోసం అన్వేషిస్తున్నాయి. మహాదేవపురం వద్ద 50 ఎకరాల భూమిని ఈ కంపెనీలు లీజుకు తీసుకొన్నాయి. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేపట్టాయి.

Follow Us:
Download App:
  • android
  • ios