టిడిపి ఎంఎల్ఏకి ఝలక్

Hundreds of tdp activists joins ycp in anantapuram constituency
Highlights

వందలాది మంది కార్యకర్తలు టిడిపి నుండి వైసిపిలోకి వెళ్ళిపోవటంతో ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరికి షాక్ కొట్టినట్లైంది.

టిడిపిలో నుండి వైసిపిలోకి వలసలు ఎక్కువవుతున్నాయి. గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణ జిల్లాల్లో పలువురు టిడిపి నేతలు వైసిపిలో చేరగా తాజాగా అనంతపురం వంతైంది. వందలాది మంది కార్యకర్తలు టిడిపి నుండి వైసిపిలోకి వెళ్ళిపోవటంతో ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరికి షాక్ కొట్టినట్లైంది.

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పలువురు టిడిపి నేతలు వైసిపిలో చేరారు. నియోజకవర్గంలోని నేత లింగాల రమేష్ తో పాటు వందలాదిమంది కార్యకర్తలు బుధవారం వైసిపి కండువా కప్పుకున్నారు. ప్రత్యేకహోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమాలు, పాదయాత్రతో తాము ఆకర్షితులమైనట్లు రమేష్ తదితరులు చెప్పారు.

loader