Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రకీలాద్రిపై మరోసారి దర్శనాల రచ్చ.. పోలీసు కుటుంబాల దర్శనాలపై సీపీ సీరియస్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నాయి. అయితే దర్శనాల విషయంలో ఇంద్రకీలాద్రిపై మరోసారి రచ్చ చోటుచేసుకుంది.

huge rush at vijayawada kanaka durga temple devotees face problems for darshan
Author
First Published Oct 1, 2022, 3:36 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నాయి. అయితే దర్శనాల విషయంలో ఇంద్రకీలాద్రిపై మరోసారి రచ్చ చోటుచేసుకుంది. ప్రొటోకాల్ డైరెక్ట్ దర్శనాలతో గంటల కొద్దీ భక్తులు కూలైన్లలో నిరీక్షించాల్సి వస్తుంది. వీఐపీ టికెట్స్ ఉన్నప్పటికీ.. గంటలపాటు క్యూలైన్‌లో వేచి చూడాల్సి వస్తుందని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 500 పెట్టి టికెట్ కొన్నా ఉపయోగం లేదంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకి దండం పెట్టారు. 

అయితే పోలీసు కుటుంబాలు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాస్‌లు లేకున్నా ఐడీ కార్డులతో డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నిన్నటి నుంచి దుర్గమ్మను దర్శించుకునేందుకు వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలిరావడం కూడా సాధారణ భక్తులు ఇబ్బందికరంగా మారింది. 

ఈ క్రమంలోనే పోలీసు కుటుంబాల దర్శనాలపై సీపీ కాంతి రాణా సీరియస్ అయ్యారు. ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందేనని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఆలయ ఈవో, కలెక్టర్ కూడా గుడి వద్దే ఉండి భక్తులకు దర్శనాల్లో అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇదిలా.. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకల్లో భాగాంగా నేడు ఆరో రోజు దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు వేచి ఉన్నారు. ఇక, ఉత్సవాలలో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో అందుకు తగ్గట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios