మీకు ఓటర్ స్లిప్ అందలేదా? ఓటర్ లిస్ట్ లో పేరు వుందో లేదో మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండిలా...! 

రేపే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్. అయినా ఇప్పటివరకు మీకు ఓటర్ స్లిప్ అందలేదా? అసలు ఓటర్ లిస్ట్ మీ పేరుందో లేదో తెెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా.? ఈ సింపుల్ స్టెప్స్ తో ఇంటినుండే ఓటర్ లిస్ట్ లో పేరుందో లేదో తెలుసుకోండి.... 

how to check your name in voter list AKP

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ తో పాటు అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఒకే దశలో జరుగుతున్న విషయం తెలిసిందే. మే 13న అంటే రేపే ఇరురాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది... తెలుగు ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అయితే మనకు ఓటు హక్కు వున్నా ఓటర్ లిస్ట్ లో పేరు లేకుంటే ఓటు వేయలెం. మరి ఓటర్ లిస్ట్ లో మన పేరు వుందో లేదో తెలుసుకోవడం ఎలా..? బూత్  లెవెల్ ఆఫీసర్ వద్ద వుండే ఓటర్ లిస్ట్ పరిశీలించవచ్చు. అలా కాకుంటే ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా మీ మొబైల్ లోనే ఓటర్ లిస్ట్ లో మీ పేరు వుందో లేదో చెక్ చేసుకోవచ్చు... ఉంటే అదే కాపీని డౌన్ లోడ్ చేసుకుని ఓటు వేయడానికి వెళ్ళిన సమయంలో ఉపయోగించవచ్చు. 

ఓటరు జాబితాలో పేరును తనిఖీ చేసే మార్గాలు :  

ఆన్ లైన్ ద్వారా...

- ఇందుకోసం.. ముందుగా  https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- ఇక్కడ ఎలక్టోరల్ రోల్‌పై క్లిక్ చేయండి.
-  వెంటనే కొత్త వెబ్‌పేజీ తెరుచుకుంటుంది. అక్కడ మీ ఓటర్ ఐడి వివరాలను నమోదు చేయాలి.
- ఇందులో పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, రాష్ట్రం , జిల్లా మొదలైన వివరాలు ఉంటాయి.
- దీని తర్వాత క్రింద ఇవ్వబడిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్ పై క్లిక్ చేయండి.
- అదే పేజీలో EPIC నంబర్, స్టేట్,  క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాల్సిన మరొక లింక్‌ని పొందుతారు.
- ఆ తర్వాత కొత్త ట్యాబ్ తెరుచుకుని ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
 
SMS ద్వారా చెక్ చేసుకోండిలా..

- దీని కోసం మీరు మీ ఫోన్ నుండి టెక్స్ట్ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది.
- EPIC అని టైప్ చేసి.. ఓటర్ ID కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. 
- అప్పుడు ఈ సందేశాన్ని 9211728082 లేదా 1950కి పంపండి.
- దీని తర్వాత మీ నంబర్‌కు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ నంబర్, పేరు వ్రాయబడుతుంది.
- ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి సమాచారం అందదు.

హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా..  

అదే విధంగా..హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం టోల్-ఫ్రీ నంబర్‌ 1950కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్)ప్రకారం..  మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి 'ఓటర్ ఐడీ స్టేటస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఐవీఆర్ చెప్పినట్టు..  EPIC ఓటర్ ఐడీ నంబర్‌ ఎంటర్ చేయాలి. ఈ నంబర్‌ ఎంట్రీ తర్వాత మీ ఓటర్ ఐడీ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది.

ఎన్నికల సంఘం సూచన:

ఓటు వేయాలంలే ఓటరు జాబితాలో పేరు తప్పనిసరిగా ఉండాలి. ఓటర్ జాబితాలో పేరు ఉండి..  ఓటరు ఐడీ కార్డు  లేకపోయినా ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తే.. ఓటు వేయటానికి అనుమతి ఇస్తారు. కానీ, జాబితా పేరు లేకపోతే మాత్రం ఓటు వేయడం కష్టం.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios