ఏపీలో వైసీపీ మెజార్టీ లోక్ సభ సీట్లు గెలుచుకోనుంది. ఇక టీడీపీ గతంలో కూడా చాలా మెరుగు కానుంది. వైసీపీ 15, టీడీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు ఓ ఒపీనియన్ పోల్ అంచనా కట్టింది. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్టు తాజాగా వెలువడ్డ ఒపీనియన్ పోల్ అంచనాలు తెలిపాయి. ఈ ఒపీనియన్ పోల్ అంచనాలు కేవలం లోక్ సభ ఎన్నికల పైనే వచ్చాయి. అయితే.. గతంలో కంటే ఎంపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని చెప్పినా.. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కంటే ఎక్కువ సీట్లే గెలుచుకుంటుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.

ఏపీలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే ఉంటుందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఈ పోల్ అంచనాల ప్రకారం వైసీపీ 15 సీట్లు, టీడీపీ 10 సీట్లు గెలుచుకుంటాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా ఇక్కడ ఒక్క సీటూ గెలిచే అవకాశాలు లేవు. జనసేన పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే.

Also Read : Lok Sabah Polls : తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఒపీనియన్ పోల్స్ అంచనాలివే

వైసీపీ 15 సీట్లు గెలుచుకుంటుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఇవి గతంలో కంటే చాలా తక్కువ. 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 సీట్లకు గాను 23 ఎంపీ సీట్లను వైసీపీనే గెలుచుకుంది. ఇక టీడీపీ మాత్రం కేవలం మూడు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ, ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు సీట్లను కోల్పోయే ముప్పు ఉన్నదని అంచనాలు తెలిపాయి.