అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.గుంటూరుకు చెందిన ఓ విద్యార్ధి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 326 ప్రకారంగా 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉదంటూ పిటిషనర్  గుర్తు చేశారు.

2019 ఓటరు జాబితా ప్రకారంగా ఎన్నికలు నిర్వహిస్తే 3.60 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని  పిటిషనర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై   సోమవారం నాడు  విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి తొలి విడత షెడ్యూల్ ను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.  ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేసింది.